Krishnamma : సత్యదేవ్‌ ‘కృష్ణమ్మ’ నుంచి థీమ్ ఆఫ్ వెంజెన్స్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ రూటే సపరేటు. ఓ సినిమాలో హీరోగా కనిపిస్తాడు.. మరో మూవీలో విలన్ గా మెప్పిస్తాడు. ఇంకో చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మైమరపిస్తాడు. చేసే పాత్ర ఏదైనా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం మాత్రం కామన్. ఈసారి ఆయన హీరోగా కృష్ణమ్మ అనే మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాల కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ఇవాళ రిలీజ్ అయింది.

థీమ్ ఆఫ్ వెంజెన్స్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ పాట ఇప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తోంది. చూపుల్లో శూన్యం.. సుడిలో హృదయం.. పైపైనే మౌనం.. ఎదలో మథనం.. అంటూ సాగిన ఈ పాట చూస్తే ప్రతీకారం తీర్చుకోడానికి పగతో ఎదురుచూస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది. అనంత్ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను కాలభైరవ కంపోజ్ చేయగా.. జిషన్‌లో దీలిపు, కాలభైరవ క‌లిసి పాడారు. అరుణాచల క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news