జై హనుమాన్ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ సీక్వెల్ సినిమాల్లో జై హనుమాన్ ఒకటి. ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని కనబరిచింది. హనుమాన్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రేజీ సీక్వెల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేయడంతో ఈ మూవీ అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో కన్నడ హీరో, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త ట్రీట్ ను అందించారు. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హనుమంతుడి పాత్రకు సంబంధించిన ఈ థీమ్ సాంగ్ ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని పెంచేవిధంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో రూపొందించేందుకు సిద్దమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version