దీపావళి నాడు ఎందుకు వినాయకుడిని పూజించాలి..? దాని వెనుక కథ ఏంటి..?

-

దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది. దీపావళి నాడు ప్రదోషకాలంలో ప్రజలు లక్ష్మీదేవికి వినాయకుడికి పూజలు చేస్తారు. ఇంట్లోనే కాకుండా ఆఫీసుల్లో, షాపుల్లో కూడా పూజలు చేస్తారు. దీపావళి నాడు వినాయకుడితో పాటుగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అయితే వినాయకుడిని దీపావళి నాడు ఎందుకు పూజించాలి..? దాని వెనుక కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణువు మధ్య మాటలు వచ్చాయి అప్పుడు సంపదకి తాను అధినేతని అని లక్ష్మీదేవి గర్వం వ్యక్తం చేస్తుంది.

సంపద, శ్రేయస్సు, అదృష్టం నేను ప్రసాదిస్తాను అని చెప్తుంది, విష్ణుమూర్తి తనకి బుద్ధి రావాలని ఏమున్నా నిజమైన స్త్రీ అంటే మాతృత్వంతో నిండిన ఆనందం మాత్రమే కలుగుతుంది. నీకు అది లేదు అని చెప్తారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి మాటలకు బాధపడుతుంది. తను వెళ్లి పార్వతి దేవికి బాధని చెప్తుంది. పార్వతి దేవి తన కొడుకు గణేషుడిని లక్ష్మీదేవికి దత్తపుత్రుడుగా ఇచ్చింది.

దీంతో ఆమె సంతోషిస్తుంది. అప్పటి నుంచి వినాయకుడికి లక్ష్మీదేవి మాతృమూర్తిగా మారింది అయితే సంపద విజయం శ్రేయస్సుని పొందడం కోసం లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పెట్టి పూజిస్తారు. లక్ష్మీదేవి సంపద దేవత వినాయకుడు జ్ఞానం తెలివికి దేవుడని ఆరాధిస్తారు. దీపావళి నాడు అందుకే వినాయకుడిని లక్ష్మీదేవిని కలిపి ఆరాధిస్తారు. దీపావళి నాడు నెయ్యితో లక్ష్మీదేవికి దీపారాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version