దీపావళి పండగ సందర్భంగా నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ముహూరత్ ట్రేడింగ్ ఉండనుంది. ఈ సమయంలో ట్రేడింగ్ చేస్తే సంవత్సరం మొత్తం మంచి లాభదాయకంగా ఉంటుందని ఇన్వెస్టర్లు నమ్ముతారు. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తోంది.
ముహూరత్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా బ్రోకింగ్ సంస్థలు ముహూరత్ ట్రేడింగ్ రోజున ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలో పైన జాగ్రత్తలతో పాటు సలహాలు ఇస్తున్నాయి.
అయితే స్టాక్ మార్కెట్ నిపుణులు.. ప్రత్యేకంగా మూడు స్టాక్స్ గురించి వివరిస్తున్నారు. సంవత్సరంలోగా ఈ స్టాక్స్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కరూర్ వైశ్యా బ్యాంక్:
ఈ బ్యాంక్ స్టాక్ ని 214 – 218 మధ్య కొనవచ్చునని.. టార్గెట్ ప్రైస్ 249 నుండి 269 దాకా ఉండనుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ముహూర్తం ట్రేడింగ్ రోజున ఇన్వెస్ట్ చేసే ఆలోచనలు ఉన్నవారు ఒకసారి కరూర్ వైశ్యా బ్యాంక్ స్టాక్ వైపు చూడవచ్చని తెలియజేస్తున్నారు.
స్టయిలం ఇండస్ట్రీస్ :
దీని టార్గెట్ ప్రైస్ 2560 నుండి 2690 మధ్య ఉండనుందని అంచనా వేస్తున్నారు. అలాగే బయింగ్ రేంజ్ 2195- 2230 మధ్య ఉంటే బాగుంటుందట. స్టాప్ లాస్ వచ్చేసి.. 1880 వద్ద లాక్ చేస్తే మంచి ఫలితాలు ఉండనున్నాయట.
యాక్సిస్ బ్యాంక్:
యాక్సిస్ బ్యాంక్ గత కొన్ని రోజులు గా పాజిటివ్ సంకేతాలను చూపిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో కొన్ని రోజులపాటు దీని స్టాక్ బులిష్ దిశగా వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టాక్ కి సంబంధించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా చదవండి.