రాజమౌళికి ఇష్టమైన లక్కీ హీరోయిన్స్ వీళ్ళే..!!

-

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీ దక్కించుకొని పాన్ ఇండియా స్థాయిలో కూడా పేరు సంపాదించుకున్న ఈయన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని చలామణి అవుతున్నారు.

ఇకపోతే రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఇకపోతే రాజమౌళి సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ముఖ్యంగా సినిమాలపరంగా ఆయన చూపించే డెడికేషన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఆ సినిమా ఆస్కార్ వరకు వెళుతుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలలో నటించాలని చాలామంది హీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని జక్కన్న సినిమాలో ఒక్కసారైనా నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నారు కూడా.. ఇకపోతే ఇలా చాలామంది హీరోయిన్లు రాజమౌళి సినిమాలో నటించాలని ఆరాటపడుతుంటే.. రాజమౌళి మాత్రం ఆ ఇద్దరు హీరోయిన్ల కోసం ఎదురుచూస్తున్నారట. అంతేకాదు ఆ ఇద్దరు హీరోయిన్లు అంటే ఆయనకు చాలా ఇష్టం అని.. ఒక సందర్భంలో కూడా తెలియజేశారు.

వారు ఎవరో కాదు స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి మరొకరు సలోని. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, విక్రమార్కుడు సినిమాలో అనుష్క తన నటన పరంగా అద్భుతంగా నటిస్తారని.. సినిమా పట్ల డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి అంటూ రాజమౌళి తెలిపారు. మరొకవైపు సలోని కూడా సినిమాలపరంగా అలాంటి డెడికేషన్ చూపిస్తారని, సునీల్ సలోని హీరోగా నటించిన మర్యాద రామన్న సినిమాలో ఆమె డెడికేషన్ కి సినిమా సక్సెస్ నిదర్శనమని రాజమౌళి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news