గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం అని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సూడో హిందుత్వ వాది అని మండిపడ్డారు. రాజాసింగ్ రాజకీయ సన్యాసం ఉత్తమం అని.. బీఆర్ఎస్ లో చేరను అంటున్నారు రాజాసింగ్..? అసలు నిన్ను ఎవ్వరూ ఆహ్వానించారు అని ప్రశ్నించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు.
రాజాసింగ్ రాజకీయ జీవితం సమాప్తం అయిందన్నారు. రాజాసింగ్ అవినీతి తారాస్థాయికి చేరిందని.. అందుకే బీజేపీ సస్పెండ్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ యాదవ్. రాజాసింగ్ సూడో హిందుత్వవాదిగా రాజకీయ పబ్బం గడుపుతున్నాడని.. వెంటనే రాజకీయాలు వదిలి.. సన్యాసం తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అని సూచించారు. రాజాసింగ్ ని ఏ పార్టీ కూడా చేర్చుకోదని.. ఆయన మతతత్వ శక్తులతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజాసింగ్ హయాంలో గోషామహల్ నియోజకవర్గం పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.