డాకు మహారాజ్ రెండు రోజుల కలెక్షన్లు ఇవే..!

-

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచినప్పటికీ.. తెలంగాణ మాత్రం టికెట్ల ధరలు పెంచలేదు. అయినప్పటికీ ఈ సినిమా అన్ని సెంటర్లలో దూసుకుపోతుంది. మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. రెండు రోజుల్లో రూ. 74 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. 

ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొంది. ఈ సినిమా తొలి రోజు ఆదివారం 56 కోట్లు వసూలు చేసింది. ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కావడంతో ఈ చిత్రానికి కాస్త కలెక్షన్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలోపు బాలయ్య మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి పండుగకు బాలయ్య జోరు ఎక్కువగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news