తనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, అమిత్ మాలవీయ స్పందిస్తూ దేశం గురించి తరువాత ఆలోచించండి. ముందు మీ ఢిల్లీ సీటును కాపాడుకోండి అని పోస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ తాను రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ప్రతిస్పందిస్తున్నారని తెలిపారు.
దీంతో కాంగ్రెస్, బీజేపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థం అవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు, బీజేపీకి ఉన్న అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీలంపుర్ లో జైబాపు.. జై సంవిధాన్ సభలో పాల్గొన్న రాహుల్ ఆఫ్ ప్రభుత్వం పై విమర్శలు చేసారు. మోడీ అనుసరించే ప్రచార కండూతి వ్యూహం, అబద్ధపు హామీల బాటలో కేజ్రీవాల్ నడుస్తున్నారని పేర్కొన్నారు. కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలను వారిద్దరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు.