అమితాబ్ కే పోటీగా నిలబడ్డ రిషి కపూర్ లైఫ్ సీక్రెట్స్ ఇవే …!

-

బాలీవుడ్‌ లో ఈరోజుకి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలపరచుకున్న సీనియర్‌ నటుడు రిషి కపూర్. బాలీవుడ్ లో ఎన్నో సంచనాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ‌రిషి కపూర్ తుది శాశ్వ విడవడంతో ఆయన అభిమానులు, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోక సముద్రం లో మునిగిపోయారు. గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబైలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చిక్త పొందుతూ ఈ రోజు మరణించారు. గత కొంతకాలంగా న్యూయార్క్‌లో చికిత్స పొందిన రిషి కపూర్‌ కొన్ని నెలల క్రితమే ఇండియాకి తిరిగి వచ్చారు. రిషి కపూర్ భార్య నీతూ కపూర్‌, కుమార్తె రిధిమా కపూర్‌ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఉన్నారు. రణ్‌బీర్‌ కపూర్ తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ గా పాపులారిటిని సంపాదించుకున్నాడు.

 

లెజెండరీ యాక్టర్ రిషి కపూర్‌ సినీ కెరీర్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

రిషి కపూర్ “బాబీ” తో సినిమా ప్రస్థానం మొదలు…రిషి కపూర్‌ తండ్రి, లెజెండరీ రాజ్‌ కపూర్‌ దర్శక, నిర్మాతగా తెరకెక్కించినన రొమాంటిక్‌ ఫిల్మ్ “బాబీ”. ఈ సినిమాతోనే రిషి కపూర్ బాలీవుడ్ కి పరిచయమవగా ఆయన సరసన డింపుల్‌ కపాడియా హీరోయిన్ గా నటించింది. 1973లో విడుదలైన ఈ సినిమాతో రిషి కపూర్‌ కెరీర్ లో ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతకముందు చైల్డ్ ఆర్టిస్ట్ గాను రిషి కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమే.

 

ఈ సినిమా తర్వాత రవి టాండన్‌ దర్శకత్వం వహించిన “ఖేల్‌ ఖేల్‌ మే” సినిమాలో నటించాడు. 1975లో విడుదలైన ఈ సినిమాలో రిషి కపూర్‌, నీతూ సింగ్‌ జంటగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాదు నిజ జీవితంలో రిషి కపూర్ నీతూ సింగ్‌ భార్య భర్త లు అవడానికి పునాది వేసింది. నిజం జీవితంలో భార్య భర్తలైన ఈ ఇద్దరు కలిసి వెండి తెరమీద 15 సినిమాలలో కలిసి నటించడం విశేషం. అయితే ఈ 15 సినిమాలలో హీరో హీరోయిన్ గా నటించడం యాదృశ్చికం. ఇక బాలీవుడ్ బెస్ట్ కపుల్ గా ఈ తరం వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు.

 

1976లో వచ్చిన కభీ కభీ, 1976లో వచ్చిన లైలా మజ్నూ, 1977లో వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాలతో తిరుగులేని స్టార్ డం ని సాధించుకున్నారు. ముఖ్యంగా
అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాలో రిషి కపూర్.. అమితాబ్‌ బచ్చన్‌, ‌వినోద్‌ ఖన్నా లతో కలిసి నటించి భారీ మల్టిస్టారర్ కి తెర తీశారు. ఇక షౌమన్‌ సుభాష్‌ ఘాయ్‌ రూపొందించిన కర్జ్ భారీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక 1970-80 మద్యలో రొమాంటిక్ మూవీస్ లో నటించి రొమాంటిక్ హీరో ఇమేజ్ ని సాధించారు. అప్పటి వరకు ఉన్న హీరోల కంటే రిషి కపూర్ రొమాంటిక్ హీరోగా సాధించిన పాపులారిటి అసాధారణం. ఎంతగా అంటే ఒక దశలో కొన్ని సినిమాలకి అమితాబ్ బచ్చన్ ని అనుకొని కూడా మళ్ళీ రిషి కపూర్ ని తీసుకున్నారట. ‌

 

1986లో విడుదలైన నగీనా సినిమాలో రిషి కపూర్‌, శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక 2000 సంవత్సరం నుండి రిషి కపూర్‌ రీ ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా వంటి యంగ్ హీరోలతో కూడా పోటీ పడి నటిస్తున్నారు. అగ్రిపథ్‌, కపూర్‌ అండ్‌ సన్స్‌, జూతా కహీ కా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పాత్ర ఏదైనా ఇప్పటి ఆ పాత్రలో రిషి కపూర్ కనిపించకపోవడం గొప్ప విషయం. అంతగా పాత్రలో లీనమవడం ఆయనకే సాధ్యం.

 

రిషి కపూర్-అమితాబ్ మద్య అనుబంధం..ఈ ఇద్దరి మద్య 1970-1980 ల మద్య విపరీతమైన పోటీ ఉండేది. అయితే అమితాబ్ బచ్చన్ యాంగ్రీ మాన్ గా నటిస్తే రిషి కపూర్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో నటించారు. ఇక పోటీ కేవలం సినిమాల మద్యనే ఉండేది. ఈ ఇదరు కలిసి నటించింది కేవలం 8 సినిమాలే. ఈ ఇద్దరు చివరిగా నటించింది…
102 నాట్ ఔట్. ఈ సినిమాలో అమితాబ్ రిషి కపూర్ తండ్రీ కొడుకులుగా నటించడం విశేష. అయితే ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు బాలీవుడ్ లో అందరు నెగిటివ్ కామెంట్స్ చేశారట. అసలు వీళ్ళని తండ్రీ కొడులుకులుగా చూపించడం ఎలా సాధ్యం అని. కాని సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ ఇద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.

 

ప్రస్తుతం రిషి కపూర్ ‘ది ఇంటర్న్‌’ అనే హాలీవుడ్‌ సినిమాతో పాటు ఒక హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా కరోనా కారణంగా ఈ సినిమాలకి బ్రేక్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version