మేజర్ కోసం ఆ ముగ్గురు..!

26/11 టెర్రరిస్ట్ దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండాపోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు అడివి శేష్. యువ హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న అడివి శేష్ మేజర్ తో మరోసారి ప్రేక్షకులకు కొత్త థ్రిల్ అందించడానికి వస్తున్నాడు. జూలై 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు రిలెజ్ అవుతుంది.

ఈ టీజర్ ను తెలుగు, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్, హిందీ టీజర్ ను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మళయాళ టీజర్ ను పృధ్వి రాజ్ సుకుమారన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూడు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. టీజర్ ని కూడా ముగ్గురు సూపర్ స్టార్స్ తో రిలీజ్ చేస్తున్నారు. అడివి శేష్ మేజర్ కు ఇది గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేలా చూస్తున్నా చిత్రయూనిట్.