బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్టు ఐఎండీ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పినట్టేనని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తీరం వెంబడి 55 KMPH వేగంతో ఈదురు గాలులు వీస్తాయని సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెల్లవద్దని సూచించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా ముప్పు తప్పిందనే చెప్పాలి. మూడు రోజుల పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.