టైగర్-3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ టైగర్-3. దీపావళి సందర్భంగా ఈనెల 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్​లో మనీశ్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో షారుక్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. తొలి రెండ్రోజుల్లో ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లు చేసి రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇప్పటికీ ఇంకా హౌస్​ఫుల్ షోస్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే థియేటర్లలో నడుస్తుండగానే సినిమాలు ఏ ఓటీటీల్లో ప్రసారం అవుతాయని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అయితే టైగర్​ -3 ఓటీటీ ప్లాట్​ఫామ్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేశాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ టైగర్3 సినిమా హక్కులను దక్కించుకుందట. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు కూడా ప్రైమ్​లోనే ఉండటం గమనార్హం. ఇప్పుడు పార్ట్-3 కూడా ప్రైమ్​లోనే రానుందట. అయితే ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news