Tiger Nageswara Rao : అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్

-

 

Tiger Nageswara Rao : అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేర్గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమా తెరకెక్కుస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tiger Nageswara Rao
Tiger Nageswara Rao

ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్, ఫస్ట్ లుక్ అదిరిపోయాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కానుందని.. దసరా బరిలో సినిమా ఉంటుందని ప్రకటించారు ఈ సినిమా దర్శకుడు. బాలీవుడ్ హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా కీలక పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తరువాత రేణుదేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news