డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. ఇవాళ మీడియాతో బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని… సమైక్య దినోత్సవం పేరుతో సీఎం కేసీఆర్ కొత్త నాటకం అంటూ ఫైర్ అయ్యారు.
మజ్లీస్ కోసమే సమైక్యతా నినాదం అంటూ నిప్పులు చెరిగా రు బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ. తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పిన కవిత కు ఈ ప్రాంతం పై ఎంత ప్రేమ ఉందొ అర్థమవుతోందని.. జమిలి ఎన్నికలు కేవలం ఉహగణాలేనని పేర్కొన్నారు బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ. డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయనే నమ్మకం ఉందని.. సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యమన్నారు. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ.