Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

-

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో గుర్తింపును తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి ప్రస్తుతం ఒక మినిమమ్ గ్యారంటీ హీరోగా ఎదిగే క్రమంలో సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సిద్దు నటించిన డీజే టిల్లు సినిమా ఎంతగా సక్సెస్ అయిందో తెలిసిందే. సినిమా ఆద్యంతం అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి విజయాన్ని సాధించారు. అందుకే ఇప్పుడు ఆ పేరును వదిలిపెట్టకుండా , దీనికి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Tillu Square Movie Release Date Fix

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రమే ఈ ‘టిల్లు స్క్వేర్’. డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి పార్ట్ ను మించి వినోదం పంచడంతోపాటు ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్’ లో యంగ్ హీరో సరసన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version