Tillu Square 5 Days Collections: ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ..85 కోట్లు క్రాస్

-

TilluSquare registers a MASSIVE 𝟖𝟓 𝐂𝐑 𝐢𝐧 𝟓 𝐃𝐚𝐲𝐬: సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు (Tillu Square) యూత్ నీరాజనం పడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే డిజె టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా చరిత్ర సృష్టించింది. అయితే.. గత 5 రోజుల్లో ఏకంగా 85 కోట్లు వసూలు చేసింది టిల్లు స్క్వేర్ సినిమా. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

TilluSquare registers a MASSIVE 𝟖𝟓 𝐂𝐑 𝐢𝐧 𝟓 𝐃𝐚𝐲𝐬

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వల్ చిత్రాలు పెద్దగా ఆకట్టు కోవనే ప్రచారం ఉంది. అయితే ఆ ప్రచారానికి టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ వేసింది. ఇటీవల రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమా బంపర్ హిట్ అయింది. దీంతో బాహుబలి 2 , దృశ్యం 2, కేజిఎఫ్ 2, హిట్ 2, బంగార్రాజు, కార్తికేయ 2 లాంటి సీక్వెల్ హిట్ సినిమాల సరసన టిల్లు గాడు చేరిపోయాడు.కాగా ఈ మోస్ట్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. దాదాపు రూ. 14 కోట్లు పెట్టి టిల్లు గాడి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news