రేవంత్ రెడ్డి నువ్వు మోగోడివైతే… 2 లక్షల రుణమాఫీ చేయ్ – కేటీఆర్

-

రేవంత్ రెడ్డి నువ్వు మోగోడివైతే… 2 లక్షల రుణమాఫీ చేయ్ అంటూ కేటీఆర్ సవాల్‌ విసిరారు. ఒక్క కేసిఆర్ మాత్రమే బాద్యుడా..ఫోన్ ట్యాపింగ్ పై 2004 నుంచి విచారణ చేయండి..కడియం శ్రీహరి,దానం పదవులు ఊడటం గ్యారంటీ..ఘనపూర్ లో ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు ఖాయం అని తెలిపారు. రేవంత్ లీక్ వీరుడు..ఫోన్ ట్యాపింగ్ పై ఓపెన్ గా మాట్లాడే దమ్ము లేదు..హీరోయిన్ లను భేదిరించాల్సిన కర్మ నాకు లేదని వెల్లడించారు.

ktr revant

నా పై మాట్లాడుతున్న మంత్రికి తలకాయ ఉందో లేదో నాకు తెల్వదు..ఫోన్ ట్యాపింగ్లో అప్పటి అధికారులకు భాధ్యత లేదా..అంటూ ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌. రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి బాధ్యులు కాదా??? అని నిలదీశారు. కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు..ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి అంటూ ఫైర్‌ అయ్యారు. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు….బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్ లు వస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news