ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాన భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయి…ఖైరతాబాద్, ఘనపూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే.. కోర్టు కు పోతాము… సుప్రీంకోర్టు తీర్పు కూడా అనర్హత వేయలని ఉందని గుర్తు చేశారు కేటీఆర్.
కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు..ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి అంటూ ఫైర్ అయ్యారు. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు….బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్ లు వస్తున్నాయన్నారు. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీ గా నీళ్ల ట్యాంకర్ లు ఇవ్వు అంటూ చురకలు అంటించారు. తాగు, సాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ముఖ్యమంత్రికి తరలించడంలో ఉన్న శ్రద్ద జల వనరులను తరలించడంపై లేదన్నారు.