నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల హ్యాట్రిక్ సినిమా నుండి ఈరోజు సాయంత్రం భారీ గిఫ్ట్ ..!

-

నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. ఇన్నాళ్ళు ఈ సినిమాని ఎన్.బి.కె 106 గా పిలుచుకున్నారు. కాని ఈ రోజు నుండి ఈ సినిమా టైటిల్ తో పిలవబోతున్నారు. అవును బాలకృష్ణ కెరీర్ లో 106 సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ తో పాటు బాలయ్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. రేపు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ రోజు సాయంత్రం బిగ్ సర్‌ప్రైజ్ ని రెడీ చేస్తున్నారు బోయపాటి టీం.

 

తాజాగా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు బోయపాటి శ్రీను బృందం. సాయంత్రం 7:09నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించి పోస్టర్ విడుదల చేశారు. “BB3” అంటూ వదిలిన ఈ పోస్టర్ తో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక “BB3″అంటే బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా 3 అని అర్థం.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు బాలయ్య చేయని అఘోరా పాత్రలో కనిపించి షాకివ్వబోతున్నాడు. ఇక మరో పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో ఇది వరకు సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version