ఈరోజు మాక్ షూట్ నిర్వహించబోతున్న రాజమౌళి ..?

-

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన ఆర్ ఆర్ ఆర్ తో సహా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చాలా సినిమాలు గత రెండు మూడు నెలలుగా చిత్రీకరణ నిలిచిపోయి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరు కలిసి షూటింగ్స్ జరుపుకునేందుకు పర్మిషన్స్ తెచ్చుకున్నారు. పేరుకైతే ఎన్నో చర్చలు జరిపి పర్మిషన్స్ తెచ్చుకున్నారు గాని ఇప్పటి వరకు ఏ ఒక్కరు సెట్స్ మీదకి వెళ్ళలేదు.

 

అయితే అందరూ రాజమౌళి మీదే ఆధారపడి ఉన్నారు. అందుకు కారణం ఆయన రెండు రోజులు మాక్ షూట్ నిర్వహించి అది సక్సస్ అయితే తారక్, చరణ్ లతో సెట్స్ మీదకి వెళ్ళాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం తో పాటు కొన్ని సందేహాలు ఉండటంతో గత నాలుగైదు రోజులుగా అనుకున్న మాక్ షూటింగ్ నిర్వహించలేకపోయారు.

అయితే ఆ మాక్ షూట్ ని ఈరోజు నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ రోజు.. రేపు నిర్వహించే మాక్ షూట్ తో రాజమౌళి కి ఉన్న కొన్ని సందేహాలు తీరితే అప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో పాటు ప్రభాస్ సినిమా, చిరంజీవి కొరటాల ఆచార్య..సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప ..పూరి జగన్నాధ్ విజయ దేవరకొండ సినిమా
నాగ చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ …సినిమాలు బ్యాలెన్స్ షూటింగ్ జరపడానికి సిద్దమవుతారని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version