టాంజానియాకు చెందిన ఈ మెడిసిన్ కోవిడ్ 19ను న‌యం చేస్తుందా ?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు మెడిసిన్‌ను క‌నిపెట్టేందుకు ఫార్మా కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. సైంటిస్టులు ఇందుకుగాను అహోరాత్రులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారు. కొంత వ‌ర‌కు కొంద‌రు సైంటిస్టులు ఈ విష‌యంలో స‌క్సెస్ సాధించారు కూడా. కానీ మెడిసిన్ మాత్రం ఇప్పుడ‌ప్పుడే వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని కోవిడ్ 19కు మెడిసిన్ వ‌చ్చిందంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

does this medicine from tanzania cures covid 19

టాంజానియాకు చెందిన Covidol అన‌బ‌డే ఓ మెడిసిన్ క‌రోనాను న‌యం చేస్తుంద‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. అక్క‌డి ప్రెసిడెంట్ జాన్ మ‌గుఫులి, ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మీ ఆల్లీ వాలిముల‌తో క‌లిసి ఆ మెడిసిన్‌కు సంబంధించిన ఫొటోను జ‌త చేసి కొంద‌రు వాటిని సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ మెడిసిన్ క‌రోనాను న‌యం చేస్తుందా ? అంటే.. అది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని తేలింది.

కోవిడోల్ అన‌బ‌డే మెడిసిన్‌ను టాంజానియాలో త‌యారుచేసిన మాట వాస్త‌వ‌మే కానీ.. దాంతో ఇంకా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌లేదు. అందువ‌ల్ల ఆ మెడిసిన్ కోవిడ్ 19పై విజ‌య‌వంతంగా ప‌నిచేస్తుందా, లేదా అనేది ఇంకా నిర్దార‌ణ కాలేదు. క‌నుక కోవిడ్ 19ను ఆ మెడిసిన్ న‌యం చేస్తుంద‌ని వ‌చ్చే వార్తల్లో ఎంత‌మాత్రం నిజం లేదు. కాబ‌ట్టి జ‌నాలు ఎవ‌రూ ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌కండి. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మే ముందు ఒక‌టికి రెండు సార్లు అవి నిజ‌మా, కాదా అనేది నిర్దారించుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version