తేజ్ ఆపరేషన్ పై నేడు క్లారిటీ..!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బైక్ స్కిడ్ అవ్వడం వల్ల కింద పడటం తో తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యింది. మొదట తేజ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడ నుండి అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈరోజు తేజ్ కలర్ బోన్ సర్జరీ పై క్లారిటీ రానుంది. కాలర్ బోన్ ఫ్యాక్చర్ అవ్వడం తో తేజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆ వైద్య ప‌రీక్ష‌ల‌లో వ‌చ్చిన ఫ‌లితాలను బ‌ట్టి తేజ్ కాలర్ బోన్ స‌ర్జ‌రీ పై డాకర్లు ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ఇక తేజ్ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశార‌ని ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ కాస్తా మా అంశంగా మారిపోయింది. యాక్సిడెంట్ సీనియ‌ర్ న‌రేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం..ఆ వ్యాఖ్య‌ల‌ను మా లోని బండ్ల గ‌ణేష్, శ్రీకాంత్ లాంటి వాళ్లు వ్య‌తిరేకించ‌డం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.