కేంద్రం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అలానే స్కీమ్స్ ని ఇచ్చి చాలా మందికి ఎంతో మేలు చేస్తోంది. అదే విధంగా రైతుకు కోసం కూడా కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. దీనితో రైతులకి కాస్త ఆర్ధిక ఇబ్బంది తగ్గుతుంది. ఇది ఇలా ఉంటే కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ స్కీమ్ కింద అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం రెట్టింపు చేయనుందా? ఇక ఈ విషయం లోకి వస్తే..
మనం తాజా నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ ఇలా కనుక మార్పు వచ్చింది అంటే అన్నదాతలకు చాలా ఊరట కలుగనుంది. ఇది ఇలా ఉండగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
అక్కడ పీఎం కిసాన్ డబ్బులు పెంపు అంశం కూడా ప్రస్థావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే కచ్చితంగా రైతులకి మరెంత రిలీఫ్ గా ఉంటుంది. మోదీ సర్కార్ ప్రస్తుతం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు రూ.6 వేలు అందిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో జమవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే రూ.6 వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతులకు అందుతున్నాయి. ఈ స్కీమ్ లో రైతులు చేరి ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.