షాకింగ్ : వికారాబాద్ లో భూకంపం..భ‌యంతో ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు..!

వికారాబాద్ జిల్లాలో మ‌రోసారి భూమికంపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బంట్వారం మండ‌లం తొర్మామిడి, బొపునారం క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు గ్రామ‌మైన పోచారం గ్రామాల‌లో భూమిం కంపించింది. దాంతో ఆయా గ్రామాల ప్ర‌జ‌లు ఇంటి నుండి భ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రుగులు తీశారు. శ‌నివారం మ‌ద్యాహ్నం 2.10 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించిన‌ట్టు స‌మాచారం.

earthquake
earthquake

ఆరు సెక‌న్ల పాటు ఒక్క సారిగా భూమి కంపించడంతో ప్ర‌జ‌లంతా ఇల్ల నుండి భ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రుగులు తీశారు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం తొర్మామిడికి 35కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గుల్భ‌ర్గా జిల్లా చించోలి తాలుకాలోని క‌ర్కిచెడ్ గ్రామంలో భూమి కంపించింది. అయితే ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌కముందే మ‌ళ్లీ భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందారు. ఇక భూకంప తీవ్ర‌త ఎంత ఉంది అన్న దానిపై అధికారులు ఇంకా వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.