టాలీవుడ్ నటి సురేఖా వాణి భర్త సురేశ్ తేజ మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కొన్ని రోజుల నుంచి ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సురేశ్ తేజ మృతితో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ సినిమా చానెల్ కు ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్నారు. ఇదివరకు ఆయన పలు టీవీ సీరియల్స్, టీవీ షోలకు డైరెక్టర్ గా పని చేశారు.
ఆయన భార్య సురేఖా వాణి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ఆమె టీవీ యాంకర్ గా ఉన్నప్పుడే వాళ్లిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సురేశ్ తేజ దర్శకత్వంలో మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలు వచ్చాయి. ఆయన పలు టీవీ కార్యక్రమాలకు కూడా దర్శకత్వం వహించారు.