తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పలువురు టాలీవుడ్ పెద్దలు కలిశారు. లోటస్ పాండ్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కోమటిరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు రాఘవేందర్ రావు తో పాటు పలువురు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మంత్రి ని కలిశారు.
ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా సినిమాటోగ్రఫీ మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాక టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ తనను కలవలేదని.. ఎవ్వరి నుంచి అభినందనలు అందలేదని మంత్రి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేవలం దిల్ రాజ్ మాత్రమే పదవీ చేపట్టినందుకు అభినందించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీరంగ పెద్దలు మంత్రితో భేటీ కావడం సినీ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.