యూఎస్ఏ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన టాలీవుడ్ స్టార్లు ఎవరో తెలుసా..?

-

ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ కు కూడా చెమటలు పట్టిస్తోంది. వరసగా బాహుబలి, సాహో, పుష్ఫ, రాధేశ్యాం… ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ఇలా వరసగా ప్యాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకుపోతోంది. వసూళ్లలో కూడా బాలీవుడ్ గత రికార్డులను తిరగరాస్తున్నాయి టాలీవుడ్ సినిమాలు. దేశ వ్యాప్తంగానే కాదు… ఇతర దేశాల్లో కూడా వసూళ్ల మోత మోగిస్తున్నాయి. ఇటీవల అన్ని సినిమాల కలెక్షన్లలో ఓవర్సీస్ కలెక్షన్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో పెద్ద మార్కెట్ యూఎస్ఏ. అయితే అక్కడ కలెక్షన్లు సాధిస్తే… సినిమా హిట్ అయినట్లే అనే అభిప్రాయం ఉంది. 

యూఎస్ఏలో ఇప్పటి వరకు రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసిన తెలుగు స్టార్లు ఎవరో తెలుసా..? యూఎస్ఏ కలెక్షన్ల విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ లో ఉన్నారు. ప్రభాస్ నటించిన 4 సినిమాలు ఇప్పటివరకు యూఎస్ఏలో 2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆ తరువాతి స్థానాల్లో మహేష్ బాబు 3 సార్లు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ రెండు సార్లు తమ సినిమాలతో 2 మిలియన్ డాలర్లను వసూలు చేశారు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నితిన్, వెంకటేష్, కీర్తి సురేష్ తన సినిమాలో ఒక్కోసారి 2 మిలియన్ డాలర్లను వసూలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version