రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్… రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ అయితే… నాపై పోటీ పెట్టి గెలిపించాలి

-

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి బయటపడుతోంది. పీసీసీ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లు అన్న రేంజ్ లో ఫైటింగ్ సాగుతోంది. ముఖ్యంగా పీసీపీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తా.. రేవంత్ రెడ్డి తనపై అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. వీహెచ్ ఆయన కూతురు కోసం వెళ్లి మంత్రి హరీష్ రావును కలిశారని.. దీంట్లో తప్పేంటని జగ్గారెడ్డి అన్నారు. పిచ్చి ఆలోచనతోని.. సింగిల్ ఎజెండా పెట్టుకుని ఇలా చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మమ్మల్ని ఎవరు సస్పెండ్ చేస్తారని సవాల్ విసిరారు. మీరు చెంచాగాళ్లు ఎవరు మాట్లాడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు. మాలాంటి వాళ్లు లేనప్పుడు ప్రభుత్వం ఎట్ల వస్తదని ఆయన ప్రశ్నించారు. మాలాంటి వాళ్లు ఉన్నప్పుడే కదా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది అని అన్నారు. రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ అని భజన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అల్టిమేట్ నిర్ణయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే అని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీని చెడగొడతాడని… పార్టీని కొంపముంచుతాడని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version