సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు సజ్జల భార్గవరెడ్డి. ఈ తరునంలోనే..సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఇక అటు హై కోర్టులో రాం గోపాల్ వర్మకు ఊరట. రామ్ గోపాల్ వర్మ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హై కోర్టు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు,ఫోటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.