BREAKING : ఈడీ ముందు హాజరైన నవదీప్

ఈడి విచారణకు కాసేపటి క్రితమే హీరో నవదీప్ హాజరైయ్యారు. హీరో నవదీప్ సెంటర్ గా ఈడీ విచారణ కొనసాగుతోంది. హీరో నవదీప్, కెల్విన్ ఆధారం గా సినీ ప్రముఖులను విచారిస్తున్నారు ఈ డి అధికారులు. 2017 నుంచి 18 వరకు నవదీప్ నటించిన ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

డ్రగ్స్ కేసు వెలుగు లోకి రాగానే పబ్ ను మూసి వేశాడు నవదీప్..అయితే ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ కి కెల్విన్ కి మధ్య లావా దేవిలు జరగినట్లు కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎఫ్ లాంజ్ పబ్బు లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2015 నుంచి 17 వరకు పంపు కేంద్రం గానే డ్రగ్స్ దందా గుర్తించారు ఈడీ అధికారులు. కాగా ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రానా, రవి తేజ, రకుల్ విచారణ కు హాజరైన సంగతి తెలిసిందే.