గుప్పెడంత మనసు సెప్టెంబర్ 13 ఎపిసోడ్ -241 : చెట్టుకింద కుర్చుని రిషీ వసూల భోజనం..జ్ఞాపకాలుండాలంటూ వసూ కొటేషన్స్

-

గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ వాలంటీర్స్ కి రిషీ గురించి చెప్తుంది. మీకు సాయం చేయటానికి వచ్చారు అని అంటుంది. సాయం అంటే ఏం సాయం అని ఒక వాలంటీర్ అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాన్ని వసూ చెప్తుంది. మీ బస్తీలో పిల్లలకు చదువు మీద శ్రద్ధ వచ్చేలా చేయటం, వయసొచ్చిన ఆడపిల్లకు ఏం చదువుకోవాలో వారికి సలహాలు ఇవ్వటం, ఉపాధి కల్పించటం ఇలా అన్నీ చెప్తుంది. అక్కడ ఉన్న వాలంటీర్స్ కు వసుధార చెప్పింది నచ్చుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా ఆ పని చేయటానికి మీకు డబ్బులు కట్టాలా అంటే అ‌వసరం లేదని రిషీ అంటాడు. వసూ ప్రాజెక్టు గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పటాన్ని రిషీ మంత్రముగ్ధుడై అలానే చూస్తూ ఉండిపోతాడు.

అలా వాళ్లకి వివరించి రిషీ వసూ తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. రిషీ వసుధారతో..ఏంటి నీ ప్లానింగ్స్, ప్రాజెక్టు మొత్తం నీ బుర్రలో ఉంటుందా అని అడుగుతాడు. అవును సర్ పద్దతి ప్రకారం ప్లాన్ చేశాను. అందుకనే నానెక్కడా కన్ఫూషన్ లేదు అంటుంది. సర్ ఈ ప్రాజెక్టు గురించి ఇంత దూరం తీసుకొచ్చానని అనిపించిందా మీకు అని వసూ అడుగుతుంది. అవును ఇంతదూరం ఎందుకు అనుకున్నాను అని రిషీ అంటాడు. సర్ మనం కడుపునిండిన వాళ్లకంటే ఆకలితో ఉన్న వారికిసాయం చేస్తే అది నిజమైన సాయం అవుతుంది. అడివి ప్రాంతాల్లో కొండకోన ప్రేదేశాల్లో ఎలికాఫ్టర్ల ద్వారా కొన్ని విత్తనాలు చల్లుతారు. అన్ని ప్రభుత్వాలు ఇలానే చేస్తూ ఉంటాయి. అలా చల్లిన విత్తనాలు అన్ని కాకపోయిన కొన్ని అయినా పెరిగి దట్టమైన అడివిగా మారుతాయి అంటూ వసూ చెప్తుంది. రిషీకి ఏమీ అర్థంకాక..ఇప్పుడు సడన్ గా కొత్త టాపిక్ తీస్తున్నావేంటి అని అడుగుతాడు. సర్.. ఎందుకు చెప్పానంటే.. మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఇక్కడికొచ్చి విత్తనాలు చల్లుతున్నట్లు.. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోఒకప్పుడు ఉపయోగపడతాయి అంటుంది. అవును నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందని ముందుకు నడుస్తారు.

దారిలో వాలంటీర్స్ తో వసూ మాట్లాడి వివరాలు సేకరిస్తుంది. ఆ తర్వాత మళ్లీ నడుస్తారు. వసూ రిషీని చూసి మీరైమైనా అలిసిపోయారా అని అడుగుతుంది. రిషీ లేదు నేనేమేం అలిసిపోలేదు అంటాడు. వసూ వాటర్ ఇస్తుంది. వాటర్ తాగిన రిషీ నాకు దాహమేస్తుంది..సరిగ్గా వాటర్ అడిగే టైం కి నా మనసు తెలుసుకున్నట్లు వాటర్ ఇచ్చావ్..ఇవన్నీ నీకు ఎలా అర్థమవుతాయ్ వసుధార అని అడుగుతాడు. వసూ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది అంతే.

కొంచెం ముందుకెళ్లాక చిన్నపిల్లకు వసూ చాక్లెట్స్ పంచిపెడుతూ ఉంటుంది. దూరం నుంచి రిషీ చూస్తూ జగతి మాటలను గుర్తుచేసుకుంటాడు. కల్మషం లేకుండా సేవ చేస్తున్న ఈ వసుధారనా ఆమె వాడుకోవాలని చూసింది అనుకుంటాడు. వసూ చాక్లెట్స్ పంచిపెడుతూ రిషీ సార్ ని నేను పట్టించోవటం లేదని అనుంటున్నాడా అని వసూ మనసులో అనుకుంటుంది. దగ్గరకు వెళ్తుంది. ఏంటి పంచడాలు అని రిషీ అడుగుతాడు. ఇదొక చెప్పలేని ఆనందం అంటూ కొటేషన్స్ చెప్తుంది. మళ్లీ సారీ సార్.. తెలియకుండానే కొటేషన్స్ చెప్పేశాను అంటుది. రిషీ ఈరోజికి పర్లేదులే అంటాడు. అయితే ఓకే సార్, ఈ సంతోషంలో మీకు ఓ చాక్లెట్ ఇస్తాను అని చాక్లెట్స్ చూస్తుంది. ఒక్కటే ఉండటంతో రిషీకి ఇస్తుంది. మరి నీకు అని రీషీ అడుగుతాడు. పర్లేదు సర్ మీరే తినండి అంటుంది వసూ. చాక్లెట్స్ లో కూడా త్యాగమేనా అని రిషీ 50 50 చేద్దాం అని చాక్లెట్ తీసుకుని విరగకొట్టాలని తెగ ప్రయత్నిస్తాడు. అది చూసిన వసూ సర్ నేను ట్రై చేస్తాను అంటుంది. రిషి మోదట ఒప్పుకోడు..తరువాత సరే ట్రై చెయ్ అని ఇస్తాడు.

కానీ అది వసూకి కూడా విరగదు. రిషీ ఓ లుక్ ఇస్తాడు. ఈ సీన్ భలే కామెడిగా ఉంటుంది. వసూ ట్రై చేసి రావటం లేదు అంటుంది. ట్రైచేయ్.. నీకు తెలిసిన కొటేషన్స్ గుర్తుతెచ్చుకో బలం తెచ్చుకో అంటాడు. వసూ ఈ చాక్లెట్ ను సగం చేయలేను కానీ, మీరే తినండి అంటుంది. రిషీ కుదరదు అంటాడు. సరే నేనే తింటాను అంటుంది. అస్సలు కుదరదు అంటాడు. వసూ ఆలిచించి ఫస్ట్ చున్నీతో విరగ్గొడదాం అనుకుంటుంది. కానీ చున్నీతో చైర్ క్లీన్ చేసింది గుర్తొచ్చి.. రిషీ కర్చీఫ్ తీసుకుని చాక్లట్ అందులో పెట్టి విరగగొట్టబోతుంది. రిషీ ఏం చేస్తున్నావ్ అని అడిగితే కాకిఎంగిలి సార్ అంటుంది వసూ.. రిషీకి ఏం అర్థంకాదు..కాకి ఎంగిలా అని అమాయకంగా అడుగుతాడు. అవును సార్ , మీకు తెలియదా..మా స్కూల్ లో చిన్నప్పుడు ఫ్రండ్స్ అందరం ఇలానే కాకిఎంగిలి తినేవాళ్లం అంటుంది. రిషీ అంటే.. అంటాడు. అంటే మీకు తెలియదనమాట అని వసూ నోట్లో పెట్టుకుని చాక్లెట్ రెండు ముక్కలు చేస్తుంది. ఒక ముక్క రిషీకి ఇచ్చి తినమంటుంది. తింటానులేకానీ నా కర్ఛీఫ్ ఇవ్వమని రిషీ అడుగుతాడు. వసూ రేపు ఉతికిస్తా అంటుంది. రీషీ ఒప్పుకోడు..నావి అనుకున్నవి నా దగ్గరే ఉండాలనుకుంటాను, వస్తువులైనా, జ్ఞాపకాలైనా అని ఇవ్వు అంటాడు. అలా చాక్లేట్ తిని బైక్ పై కారు వరకు వస్తారు.

కారు ఎక్కుతారు. రిషీ కారు ఎక్కి వెతుకుతాడు. ఏంటిసార్ వేతుకుతున్నారు ఆకలేస్తుందా అని అడుగుతుంది. రిషీ ..అంటే కడుపులో ఒక రకంగా ఉంది, ఆకలి అనొచ్చేమే, కాదేమే అంటాడు. వసూ నవ్వుకుని బ్యాగ్ లో ఉన్న బాక్స్ తీస్తుంది. రిషీ వాటిని చూసి హే ఏంటిది అని అడుగుతాడు. ఇద్దరికి తీసుకొచ్చాను సార్ అని వసూ అంటుంది. వాటిన చూసి రిషీ నువ్వు చాలా ప్లానింగ్ లో ఉంటావ్ కదా అంటాడు. ప్లానింగ్ ఏం లేదు సార్..బయటకువస్తున్నాం కదా..తినటానికి ఏమైనా దొరుకుతుందో లేదో అని తీసుకొచ్చాను అంటుంది. వచ్చేటప్పుడు జ..అని ఆపేస్తుంది. రిషీ ఏంటి ఏమో అంటున్నావ్ అని అడుగుతాడు. వసూ ఆ బాక్సులు ఇచ్చింది జగతిమోడమ్ అంటే తినరు అనుకుని కామ్ గా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉన్నా ఎడ్జెస్ట్ అవ్వండి సార్ అంటుంది. ఆకలేస్తుంది మొర్రో అంటే టేస్టులగురించి మాట్లాడతానా చెప్పు అంటూ రిషీ అంటాడు. నేను తీసుకొచ్చిన బాక్స్ మీకు నచ్చుతుందో లేదో అని అడిగాను అంతే అంటుంది. ప్రతిసారి నన్ను విలన్ గా చూడకు అని రిషీ అంటాడు. ఎక్కడతిందాం అనుకుని పక్కనే ఉన్న చెట్టు దగ్గరు వెళ్తారు.

రిషీ ఇక్కడ కుర్చోడానికి ఏం లేదు కదా..ఎలా తింటాం కారులో కుర్చోని తినే‌వాళ్లం కదా అంటాడు. వసూ సార్..మీరేమనుకోనంటే ఒకటి చెప్తాను అంటుంది. ఆకలేస్తుంది. పదిమార్కుల వ్యాసంలా కాకుండా చిన్నగా చెప్పు అంటాడు రిషీ. మనం ఎక్కడివెళ్లినా అక్కడివి కొన్ని జ్ఞాపకాలు తీసుకెళ్లాలి ఇంటికి అంటుంది. అర్థంకాలేదు అంటే వసూ వివరిస్తుంది. నువ్వు కవితలేమైనా రాసేదానివా అంటే..వసూ ఆనందంతో అప్పట్లో చాలా రేసాదాన్నిఅని ఒకటి చెప్పనా అంటుంది. నాకు ఆకలేస్తుంది నీ కవిసమ్మేళనం తరువాత పెట్టుకుందాం అంటాడు. ఎక్కడ కుర్చుందాం అని అడిగితే.. వసూ పక్కన ఉన్న గడ్డి తీసుకొచ్చి పరిచి కుర్చోమంటుంది. రిషి కుర్చుంటాడు. బైక్ తీసుకున్నాం, వాడుకున్నాం పెట్రోల్ డబ్బులన్నా ఇవ్వాల్సిందేమో అంటాడు. అలా ఇస్తే ఫీల్ అవుతారు నేను వేరే రూపంలో తనకి హెల్ప్ చేస్తాను అంటుంది. ఇద్దరు తినటం మొదలుపెడతారు. రిషీ రెండు స్పూనులు తిని వంట ఎవరు చేశారు అని అడుతాడు. వసూకి భయమేస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో రిషీ గదిలో ఉన్నప్పుడు వసూ ఎంగిలిచేసిన కర్ఛీఫ్ గాలికి బయటకువెళ్తూ ఉంటే రిషీ దానివెనకే పరుగెట్టి..దేవయాని తొక్కకుండా ఆపుతాడు. మొత్తానికి రిషీకి ఆ కర్ఛీఫ్ చూసి మురిసిపోతున్నాడు. పూర్తివివరాలు రేపంటో భాగంలో తెలుసుకుందాం.!

Read more RELATED
Recommended to you

Latest news