డ్రగ్స్ తీసుకోవడంపై నటి హేమ సంచలన ప్రకటన

-

టాలీవుడ్‌ నటి హేమ మరో సంచలన ప్రకటన చేశారు. తాను డ్రగ్స్‌ తీసుకోలేదని వెల్లడించారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన బెంగుళూరు పోలీసులు.. 1086 పేజీలతో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. సినీ నటి హేమా రేవ్‌ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు పోలీసులు. అయితే.. దీనిపై నటి హేమ స్పందించారు.

tollywood hema on Bengaluru Rave Party

నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని… బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ నా పేరు వచ్చినట్టు తెలిసిందని వివరించారు. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు టాలీవుడ్‌ నటి హేమ. చార్జ్ షీట్ నాకు వచ్చాక నేను స్పందిస్తానని పేర్కొన్నారు. నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని చార్జ్ షీట్ లో వేశారన్నారు టాలీవుడ్‌ నటి హేమ. MDMA నేను డ్రగ్స్ తీసుకోలేదని వివరించారు. మీడియా వలనే నాపేరు ఛార్జ్ షీట్ లో పెట్టారన్నారు టాలీవుడ్‌ నటి హేమ.

Read more RELATED
Recommended to you

Exit mobile version