కేసీఆర్ ను వాడేస్తున్న టాలీవుడ్ !

-

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఊరమాస్ క్యారెక్టర్​తో మెప్పించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా మంచి వసూల్లు సాధించి రికార్డులు కొల్ల కొట్టిన విషయం తెలిసిందే. రామ్ కెరీర్​లోనే బ్లాక్ బస్టర్​గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా డబుల్ ఇస్మార్ట్​గా వచ్చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ని సైలెంట్ గా పూర్తి చేశారు.

ఈ చిత్రం మార్చి లోనే విడుదల కావాల్సి ఉంది. మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో ఈ చిత్రం విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హనుమాన్ నిర్మాత నీరంజన్ రెడ్డికి విడుదల బాధ్యతలు అప్పగించారు. ఈ తరుణంలో ఈ చిత్రం నుంచి ఓ మాస్‌ సాంగ్‌ వచ్చింది. మార్ ముంత చోడ్ చింతా అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ప్రోమోకే ఆడియన్స్ ఫిదా అయ్యారు. పుల్ సాంగ్ వచ్చేసింది. అయితే, ఇందులో కేసీఆర్ డైలాగ్ వాడారు. ఇంకేం చేద్దాం అంటావ్ అంటూ కేసీఆర్ చెప్పిన డైలాగ్ వాడారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version