Allu Arjun: హైకోర్టును అశ్రయించారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఏపీ హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును..క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఈ మేరకు హైకోర్టును అశ్రయించారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.
అయితే… క్వాష్ చేయాలని దాఖలు చేసిన అల్లు అర్జున్ పిటిషన్ పై ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఇది ఇలా ఉండగా… ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారని.. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం పెంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. అల్లు కుటుంబం, మెగా కుటుంబం మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వచ్చాయి.