అక్రమ అరెస్టులు ఆపండి.. రాష్ట్ర డీజీపీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశం!

-

నగరంలోని కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ పోలీసులకు, హిందూ సంఘాలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, మరొకరికి చేయి విరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేశారు. బీజేపీ, యువమోర్చా, ఆర్ఎస్ఎస్ నాయకుల అరెస్టును ఖండించడంతో పాటు వారిని వెంటనే విడుదల చేయాలని డీజీపీని ఆదేశించారు. కాగా, ఈ నెల 14న కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి సలీం అనే వ్యక్తి అక్రమంగా చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version