రవితేజ ఖిలాడీలో టాప్ యాంకర్..!

గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజ, ప్రస్తుతం రెండు ప్రాజెక్టులని లైన్లో పెట్టాడు. క్రాక్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తర్వాతి చిత్రాన్ని రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రకటించాడు. రాక్షసుడు సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రమేష్ వర్మతో ఖిలాడీ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. క్రాక్ పూర్తయ్యాక ఖిలాడీ చిత్రీకరణ మొదలవనుందట. ఐతే తాజా సమాచారం ప్రకారం ఖిలాడీ చిత్రంలో బుల్లితెర టాప్ యాంకర్ కనిపించనుందట.

తెలుగు టెలివిజన్ కి తన అందంతో మరింత గ్లామర్ ని తీసుకువచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని అందుకున్న అనసూయ, ఖిలాడీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. నటనకి ఆస్కారమున్న ఈ పాత్రలో అనసూయ ఐతే బాగుంటుందని ఆమెని తీసుకున్నారని ఫిలిమ్ నగర్ కోడై కూస్తుంది. రంగస్థలం తర్వాత నటిగా వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటున్న అనసూయకి ఖిలాడీ చిత్రం ఎలాంటి విజయం ఇస్తుందో చూడాలి. ఇదే కాకుండా క్రిష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమాలో మరో మంచి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.