BREAKING : జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి..సోదాలు చేసిన పోలీసులు..

-

టాలీవుడ్‌ స్టార్‌, యంగ్‌ టైగన్‌ ఎన్టీఆర్ కు ఊహించని షాక్‌ తగిలింది. హీరో ఎన్టీఆర్ కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద రెండోరోజు వాహనాలను తనిఖీ చేశారు. బ్లాక్ సీలింగ్ మరియు నలుపు తెరలు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు పోలీసులు.

ఈ నేపథ్యం లోనే అటుగా వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారును… ఆపి మరీ బ్లాక్ ఫిలింను తొలగించారు పోలీసులు. ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారుడు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఎంత చెప్పినా పోలీసులు… తమ డ్యూటీని చేసేసారు.

అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్… మేరాజు హుస్సేన్, ఏపీకి చెందిన శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్లను కూడా ఆయా వాహనాల నుంచి తొలగించారు. అలాగే నిబంధనలకు అనుగుణంగా నెంబర్ ప్లేట్ వాహనాలను గుర్తించి, చలాన్లు విధించారు పోలీసులు. మొత్తం 90 వాహనాలపై ఇవాళ ఒక్కరోజే కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news