ట్రైల‌ర్ టాక్ : నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ ?

-

24 గంటల్లో 11.83 మిలియన్ వ్యూస్

24 గంటల్లో 1.11 మిలియన్ లైక్స్

ఈ రెండూ కూడా ప‌వన్ అభిమానులను నిరాశ ప‌రిచివే.. వ్యూస్ ప‌రంగా 14 మిలియ‌న్ వ్యూస్ రావాల‌ని అంతా భావించారు. అంతే స‌మానంగా లైక్స్ కూడా రావాల‌ని అనుకున్నారు.కానీ ట్రైల‌ర్ అభిమానుల ఆశ‌ల‌కు అనుగుణంగా లేక‌పోవ‌డంతో యూ ట్యూబ్ లో రికార్డుల‌ను బ్రేక్ చేయ‌లేకపోయింద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంద‌ని అంతా  ఆశించినా నిర్మాణ సంస్థ నిర్వాకం కార‌ణంగా యూ ట్యూబ్ లో టాప్ ప్లేస్  లో ఉండాల్సిన ట్రైల‌ర్ కాస్త వెనుకంజ‌లో ఉండిపోయింది.

సాధార‌ణంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌మ హీరోకు సంబంధించి ఏ అప్టేడ్ వ‌చ్చినా కూడా వాటిని ట్రెండ్ ఇన్ చేయ‌డంలో ముందుంటారు. సినిమాకుసంబంధించి ఏ చిన్న అప్టేడ్ ను వాళ్లు వ‌ద‌ల‌రు.సినిమాఅనే కాదు జ‌న‌సేన అప్టేడ్ లను కూడా వారు సోష‌ల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ఉంచుతారు. కానీ ఈ సినిమా విష‌య‌మై వాళ్లు అనుకున్న విధంగా ఏదీ జ‌ర‌గ‌డం లేదు.ముఖ్యంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఇంత‌వ‌ర‌కూ ఒక్క‌టంటే ఒక్క వివ‌రం కూడా స‌కాలంలో రాలేదు.దీంతో ప‌వ‌న్ అభిమానులు పూర్తి నిరాశ‌లో ఉండిపోయారు. ట్రైల‌ర్ అనుకున్న స‌మ‌యం కన్నా ఆల‌స్యంగానే రావ‌డంతో అభిమానులు ఈ ట్రైల‌ర్ ను ఎంత ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్దామ‌ని భావించినా అవేవీ కుద‌ర‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version