పెళ్లిపై త్రిషకు ఆ ఫీలింగ్ ఉందా..అందుకే ఒంటరిగా ఉందా?

-

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒకరు త్రిష..దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన త్రిష.. అనుకోకుండా సినిమాలకు దూరం అయ్యింది.ఆ తర్వాత పెళ్లి పై వస్తున్న రుమెర్స్ వల్ల సోషల్ మీడియాలో కూడా కామ్ ఉండి పోయింది..చాలా కాలాం తర్వాత 96 తో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ ప్రమోషనల్లో పాల్గోన్న త్రిష మరింత అందంగా కనిపించింది.

40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఇక తెరపైకి మరోసారి త్రిష పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పటివరకు త్రిష పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇక పొన్నియిన్ సెల్వన్ ప్రమోషనల్లో మరోసారి తన వివాహం గురించి స్పందించింది.త్రిష మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది అడుగుతుంటారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు నాకు నచ్చదు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే నేను సమాధానం ఇస్తాను.

ఎప్పుడు అనేది స్పష్టంగా చెప్పలేను. నేను పూర్తిగా ఎవరితో ఉన్నాను.. నా జీవితంలో ఎవరిని కలవబోతున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను జీవితాంతం ఉండగలిగే వ్యక్తి ఇతనే అని నాకు నమ్మకం కలగాలి. అలాగే విడాకుల మీద కూడా నాకు నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నా చుట్టూ ఉన్న వాళ్లలో పెళ్లి చేసుకుని అసంతృప్తిగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి పెళ్లిలో ఉండాలనుకోవడం లేదు..అంటూ చెన్నై బ్యూటీ చెప్పుకొచ్చింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version