తాజాగా 67వ ఫిలింఫేర్ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా చాలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు సౌత్ సినీ ప్రేమికులు కూడా విచ్చేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకు ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు సెలబ్రిటీలలో ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నది వీళ్లే..
ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ ఫిలింఫేర్ అవార్డును అందుకోగా , ఉత్తమ నటిగా లవ్ స్టోరీ సినిమాకు సాయి పల్లవి అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా పుష్ప ది రైజ్ సినిమాకు అవార్డు లభించింది.
ఇక లైఫ్ ఆఫ్ రామ్ (జాను) అనే చిత్రానికి బెస్ట్ లిరిక్స్ గా సీతారామశాస్త్రి కి అవార్డు లభించగా.. ప్లే బ్యాక్ సింగర్ గా పుష్ప సినిమాకు గాను సిద్దు శ్రీరామ్ శ్రీవల్లి పాట కోసం అవార్డు లభించింది. ఇక బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ గా ఇంద్రవతి చౌహాన్ కి, బెస్ట్ సినిమా ఆటోగ్రఫీ పుష్పకు మీరోస్లా కూబా బ్రజక్ కి అవార్డు లభించింది. ఇక డెబ్యూ హీరోగా పంజా వైష్ణవి తేజ్ తో పాటు బెస్ట్ డబ్ల్యూ హీరోయిన్ గా కృతి శెట్టి కూడా అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ కింద నాని శ్యామ్ సింగరాయ్ కి , అలాగే బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ కింద శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి నటించగా ఈ అవార్డు లభించాయి. ఇక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నిర్మాత అల్లు అరవింద్ కు లభించింది.