స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమా అదిరిపోయే హిట్ అందుకుంది. సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఈ సినిమా త్రివిక్రమ్ మరియు బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా కలెక్షన్లు రాబట్టింది. ఇటువంటి తరుణంలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ తో గతంలో త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో హిట్ అందుకుంది.
అయితే తాజాగా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ సారిపవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు…సినిమాలో ఎన్టీఆర్ సీఎం పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఈ సినిమా పండుగ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.