“ఆర్ఆర్ఆర్” వచ్చేసరికి కుబేరులైన ఏపీ ప్రజలు..జగన్ సర్కార్ పై ట్రోలింగ్ !

-

గత కొన్ని రోజుల నుంచి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నట్లుగా ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టేందుకు.. చిత్ర పరిశ్రమలో వేలు పెట్టింది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. అలాగే టికెట్ల ధరలను తగ్గించేసింది. దీంతో చిత్ర పరిశ్రమకు చాలా నష్టం వాటిల్లింది. వకీల్ సాబ్ సినిమాకు ఏపీలో భారీగా కలెక్షన్లు రాకపోవడానికి ఇదే కారణం. అయితే అప్పటి నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏపీ ప్రభుత్వం తో పోరాటం చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… ముందుకు సాగింది. అయితే చిత్ర పరిశ్రమ పెద్ద అయిన చిరంజీవి… తదితరులు స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. టికెట్లను పెంచుతూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త జీవోను తీసుకువచ్చిoది.

అయితే ఈ జీవోపై భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే నిర్ణయం తీసుకున్నప్పటికీ… జీవో ను మాత్రం అమలు చేయలేదు. పాత రేట్ల నే కొనసాగించింది ప్రభుత్వం. దీంతో భీమ్లా నాయక్ సినిమాకు కూడా నష్టమే వాటిల్లింది. అయితే ఈ సినిమా తగ్గిన తర్వాత.. అంటే రాధేశ్యాం సినిమా విడుదల కంటే ముందే.. జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో ఏపీలో టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. భీమ్లా నాయక్ సినిమా విడుదలైనప్పుడు ఏపీ ప్రజలు పేద వాళ్ళని… రాధేశ్యాం సమయంలో ఒక్కసారిగా ప్రజలు ధనవంతులు అయ్యారు అంటూ… నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అలాగే జగన్ ప్రభుత్వం పై మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు నెటిజన్లు. ఇక దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ ఆర్ఆర్ఆర్’.

బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం… జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 336 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది. ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇటీవల ట్రిపుల్ ఆర్ నిర్మాత, దర్శకలు సినిమా వ్యయం రూ. 336 కోట్లు అయిందని ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించి ప్రభుత్వ కమిటీ టికెట్ ధరపై రూ. 70 వరకు పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది. ఈ ధరలు కూడా మొదటి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు టికెట్ల ధరలు ఎందుకు… త్రిపుల్ ఆర్ సినిమా కు ఎందుకు పెంచారు అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. అంటే ఈ సినిమా వరకు ఏపీ ప్రజలు కుబేరులు అయ్యారా ? అంటూ పోస్టులు పెడుతున్నారు. ధరలు పెంచడం పై జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news