ప్రజలకు మంచి చేయాలనే సినిమాలు వదులుకొని వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పల్లె పండుగలో భాగంగా గోకులం షెడ్లు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో జరిగిన ఘటన బాధ కలిగించింది. సంక్రాంతి ఘనంగా జరుపుకుందాం అనుకున్నాం. కానీ చిన్నగా చేసుకుందాం. పిఠాపురం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.
ప్రతీ మూడు నెలలకొకసారి అభివృద్ధి గురించి చెప్పాలి. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ఓట్లు వేశారు. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం బాధ్యులం కాబట్టి.. క్షమాపణలు అడిగాం. పంచాయతీరాజ్ లో తప్పులు జరిగితే సమిష్టి బాధ్యత అన్నారు. ఎవరు తప్పు చేసిన బాధ్యత తీసుకోవాలి. తిరుపతిలో ప్రతీ వ్యక్తి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.