విజయ్ దేవరకొండ స్టేజీ మీద ఏడుపు అంతా నటనేనా?

-

దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా స్పందించారు. తమ హీరో సినిమాల్లో మాత్రమే నటిస్తాడని… ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుతాడంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆనంద్ దేవరకొండో సత్తా ఉంటే సినిమా హిట్ అవుతుంది.. లేకుంటే కాదు.. అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

సాధారణంగా విజయ్ దేవరకొండ స్టేజీల మీద ఎమోషనల్ గానే మాట్లాడుతాడు. కాకపోతే ఆ ఎమోషనల్ స్పీచ్ లో ఉత్సాహం ఉంటుంది. అయితే.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ అయిపోయాడు. చాలా సెన్సిటివ్ అయిపోయాడు. స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో విజయ్ లో కూడా మరో కోణం ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

దొరసాని సినిమా పూజా కార్యక్రమాలకు రావాలని అనుకున్నా. టీజర్ షేర్ చేయాలని అనుకున్నా. ఈసినిమాలోని పాటలు నాకు చాలా ఇష్టం. షేర్ చేద్దాం అనుకున్నా.. కానీ.. వీటన్నింటిలో నేను ఏదీ చేయలేదు. ఆపుకున్నా.. ఎందకంటే.. ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో.. తనను తాను ఎలా నిరూపించుకోవాలో ఆనంద్ తెలుసుకుంటాడని ఇప్పటి వరకు ఈ సినిమాను నేను పట్టించుకోలేదు అంటూ విజయ్ దేవరకొండ స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

దీంతో.. అక్కడ ఉన్నవారంతా కంగు తిన్నారు. విజయ్ తమ్ముడు, వాళ్ల అమ్మ కూడా విజయ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే.. విజయ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… విజయ్ పై నెటిజన్లు ట్రోల్స్ స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ లేకపోతే.. ఆనంద్ ఎక్కడున్నాడు. విజయ్ వల్లనే ఆనంద్ కు చాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కోసమే విజయ్ ఏడ్చినట్టు స్టేజీ మీద నటించాడు. ఆయన ఏడ్చినంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు… అంటూ విజయ్ పై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా స్పందించారు. తమ హీరో సినిమాల్లో మాత్రమే నటిస్తాడని… ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుతాడంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆనంద్ దేవరకొండో సత్తా ఉంటే సినిమా హిట్ అవుతుంది.. లేకుంటే కాదు.. అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version