టాలీవుడ్ డ్ర‌గ్ ఎడిక్ట్ లిస్టులో మ‌రో ఇద్ద‌రు టాప్ హీరోయిన్లు…!

-

బాలీవుడ్ దివంగ‌త న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత జ‌రుగ‌తోన్న విచార‌ణ‌లో కొత్త‌గా డ్ర‌గ్ ఉదంతం కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. బాలీవుడ్‌లో మొద‌లు అయిన డ్ర‌గ్ ఉదంతం ముంబై టు బెంగ‌ళూరుకు చేరుకుంది. శాండ‌ల్‌వుడ్ లో ఈ కేసును విచారిస్తోన్న కొద్ది అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అక్క‌డ హాట్ హీరోయిన్లు సంజ‌నా గ‌ల్రానీ, రాగిణి ద్వివేదీల‌కు డ్ర‌గ్ డీల‌ర్ల‌తో లింకులు ఉన్న‌ట్టు ఆధారాలు ల‌భ్యం కావ‌డంతో పోలీసులు ఈ ఇద్ద‌రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆ ఇద్ద‌రితో పాటు మంగ‌ళూరుకు చెందిన డ్ర‌గ్ ప్లెడ‌ర్ ప్ర‌తీక్‌శెట్టితో పాటు ఉడిపికి చెందిన మ‌రో డ్ర‌గ్ ప్లెడ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్ ఉదంతంలో మ‌రికొంద‌రు న‌టుల‌తో పాటు కొంద‌రు రాజ‌కీయ నేత‌ల పుత్ర‌ర‌త్నాలు కూడా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తి తెలుగులో కూడా సినిమాలు చేసింది. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ నుంచి తెలుగుకు దిగుమ‌తి అయిన కొంద‌రు హీరోయిన్ల‌తో పాటు ఇక్క‌డ కూడా ఆమె ఫ్రెండ్స్ చైన్ అయితే ఉంద‌న్న‌ది విచార‌ణ‌లో తేలింది. రియా నార్కో అధికారుల విచార‌ణ‌లో టాలీవుడ్‌లో నిన్నటి వ‌ర‌కు స్టార్ హీరోయిన్‌గా ఉన్న ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు సారా ఆలీఖాన్ పేర్లు కూడా చెప్పింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

ఇక రియా చ‌క్ర‌వ‌ర్తి వ‌యా ర‌కుల్‌ప్రీత్ ద్వారా ఈ డ్ర‌గ్ లింకులు టాలీవుడ్‌లో మ‌రి కొంద‌రు హీరో, హీరోయిన్ల వ‌ర‌కు ఉన్నాయంటున్నారు. ఇక ర‌కుల్‌ప్రీత్ ద్వారా మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా డ్ర‌గ్స్‌కు బాగా బానిస‌లైన‌ట్టు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఒక‌రు సొట్ట‌బుగ్గ‌ల హీరోయిన్‌. త‌న అంద‌చందాల‌తో కొంత కాలం సినిమాలు చేసినా ఇప్పుడు ఫేడ‌వుట్ అయిపోయింది. వ‌రుస ప్లాపుల‌తో ఆమెకు ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌డం లేదు. భ‌లే భ‌లే అంటూ  మంచి హిట్ కొట్టినా త‌ర్వాత ఆమెకు స‌రైన ఛాన్సులు రాని ప‌రిస్థితి. స‌ద‌రు హీరోయిన్ ర‌కుల్ క‌లిసి డ్ర‌గ్ పార్టీల్లో మునిగి తేలుతార‌ట‌.

ఇక ల‌డ్డూలాగా బొద్దుగా ఉండే మ‌రో హీరోయిన్‌కు గ‌తేడాది చివ‌ర్లో వారం తేడాలో రెండు మంచి హిట్లు ప‌డ్డాయి. మెగా హీరోతో కూడా హిట్ కొట్టింది. ఈ యేడాది ఆరంభంలో మ‌రో యువ హీరోతో చేసిన సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. ఈ హీరోయిన్ కూడా డ్ర‌గ్ పార్టీల్లో మునిగి తేలుతుంద‌ట‌. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు వీరి పేర్లు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో నానుతుండ‌గా రేప‌టి రోజున మ‌రి ఇంకెన్ని పేర్లు లీక్ అవుతాయో ?  చూడాలి.

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Exit mobile version