ఐపీఎల్ 13: అతని ఆట చూడాలని వెయిట్ చేస్తున్నా.. గౌతమ్ గంభీర్..

-

ఐపీఎల్ 13వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా టైమ్ లో ఆలస్యంగా మొదలవుతున్న ఐపీఎల్ కోసం దేశవ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్నారు. బయటకి వెళ్దామంటేనే భయపడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ సీజన్ చక్కటి వినోదంగా మారనుంది. క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాడి ఆటని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది. ఐతే తాజాగా గౌతమ్ గంభీర్ ఐపీల్ ఆడుతున్న ఆటగాళ్ళపై తనదైన కామెంట్లు చేసాడు. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాడైన నికోలస్ పూరన్ గురించి చెప్పుకొచ్చాడు. పంజాబ్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ చాలా మంచి ఆటగాడని, మైదానంలో ఏ వైపుకి అయినా ఆడే సామర్థ్యం ఉన్నవాడని, ఏబీ డివిలియర్స్ లాగా నికోలస్ పూరన్ కూడా బ్యాటింగ్ తో అలరిస్తాడని అంటున్నారు. ఈ సారి సీజన్లో నికోలస్ పూరన్ పర్ ఫార్మెనెన్స్ చూడడానికి ఆసక్తిగా ఉందని, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ లో అతని ఆట చూడడం కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version