విల‌క్ష‌ణ న‌టుడు రావుర‌మేశ్ ప్ర‌స్థానం.. కేజీఎఫ్‌-2తో మ‌రో మైలురాయి!

-

రావుర‌మేశ్ అంటే ఒక పాత్ర‌కు ప‌రిమితం చేస్తూ చెప్ప‌లేము. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. విల‌న్ పాత్ర‌ల‌ను త‌న‌దైన స్టైల్‌లో పండించ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఇక బ‌రువైన ఎమోష‌న‌ల్ సీన్స్‌ను ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేంత‌గా ఆయ‌న పండిస్తుంటారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు ఓ సెన్సేష‌న‌ల్ మూవీలో చేస్తున్నాడు.

ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ వెయిటెడ్ మూవీగా కేజేఎఫ్‌-2 తెర‌కెక్కుతోంది. మొద‌టి పార్టు కేజీఎఫ్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నెగంటి రాఘవన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు.

ఈరోజు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కేజీఎఫ్-2 మూవీ టీమ్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. కేజీఎఫ్ టైమ్స్ పేప‌ర్ లో రావు ర‌మేశ్‌గురించి వ‌చ్చిన వార్త‌ను ఆ పోస్ట‌ర్‌లో ఉంచారు. దీంతో ఆయ‌న‌ది ఇన్వెస్టిగేష‌న్‌కు సంబంధించిన పాత్ర‌గా తెలుస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ ‘అధీరా’ పాత్రలో కనిపించనున్నాడు. య‌శ్ పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news