బీస్ట్ వర్సెస్ KGF2.. సీఎం కొడుకు కామెంట్స్ ఇవే..

-

ప్రశాంత్ నీల్- యశ్ కాంబోలో తెరకెక్కిన ‘KGF చాప్టర్ 2’ ఫిల్మ్ గత నెల 14న విడుదలైంది. ఈ సినిమా చాప్టర్ 1కు సీక్వెల్ గా వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి విశేష ఆదరణ లభిస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్ బాక్సాఫీస్ కా బాప్ అయిపోయారు.

ఇప్పటికే ఈ పిక్చర్ చూసి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, కోలవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ నెల 20న ఆయన నటించిన ‘నెంజుకు నీది’ చిత్రం విడుదల కానుంది. ఈ పిక్చర్ ప్రమోషన్స్ లో భాగంగా ఉదయనిధి స్టాలిన్ KGF2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ కమర్షియల్ హిట్ అని తెలిపిన ఉదయనిధి స్టాలిన్..KGF2 అంతకు మించిన బిగ్ హిట్ అని పేర్కొన్నారు. KGF2, బీస్ట్ మధ్య క్లాష్ ఏమీ లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరలవుతోంది. తనకు సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ విషయాలు కూడా తెలుసని ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news