‘అర్హత లేని సినిమాలను ఆస్కార్కు పంపిస్తున్నారు..’ ఏఆర్ రెహమాన్

-

ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్‌ అందుకున్న విజేత ఏ ఆర్ రెహమాన్ తాజాగా జరిగిన ఆస్కార్ అవార్డుల పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..తాజాగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డులు వేడుకల్లో అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ విజయం పై దేశమంతా హర్షం వ్యక్తం అయింది. కాగా ఇదే సమయంలో ఆర్ఆర్అర్ సినిమాను నామినేషన్కు పంపించలేనందుకు పలు వాదనలు సైతం వినిపిస్తూ వస్తున్నాయి. ఆస్కార్ నామినేషన్కు అర్ఆర్ఆర్ కు బదులుగా గుజరాతి చిత్రం చెల్లో షోను పంపించగా.. ఈ చిత్రం ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకో లేకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాకు బదులుగా అర్ఆర్ఆర్ ను ఆస్కార్ నామినేషన్స్ కు పంపిస్తే తప్పకుండా విజయం సాధించి ఉండేదని అభిప్రాయం వ్యక్తం అయింది. ఇదే విషయంపై తాజాగా స్పందించారు ఏఆర్ రెహమాన్.

AR Rahman on why he hates the term Bollywood: Anything coming out of ...

ఏ ఆర్ రెహమాన్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యం తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సంగీతం గురించి పలు ఆసక్తికర విషయాలు చర్చించారు. అలాగే మారుతున్న టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఆస్కార్ అవార్డుల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ‘కొన్నిసార్లు మా సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లిన నిరాశతో వెనక్కు తిరిగి వస్తున్నాయి అర్హత ఉన్న సినిమాలను దూరం పెట్టి అర్హత లేని సినిమాలను ఆస్కార్కు పంపిస్తున్నారు అనిపిస్తుంది కానీ ఈ విషయంలో మనం ఏం చేయగలం జస్ట్ అలా చూస్తూ ఉండడం తప్ప..’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్కు పంపించకపోవడం వల్లనే ఏఆర్ రెహమాన్ ఇలా మాట్లాడారు అంటూ కూడా నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news