హెలికాప్టర్ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి

-

భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలలో గురువారం కూలిపోవడం జరిగింది. ఈ హెలికాప్టర్ ఘటనలో ఇద్దరు పైలట్లు (లెఫ్టినెంట్ కల్నల్ VVB రెడ్డి , మేజర్ జయంత్) చనిపోయారని ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారి కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా నిలుస్తుందని తెలిపారు. మార్చి 16న ఉదయం 9 గంటల 15 నిమిషాల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో చీతా హెలికాఫ్టర్ సంబంధాన్ని కోల్పోయింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (CoI)ని ఆదేశించడం జరిగిందని ఆర్మీ అధికారులు తెలపారు.

అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక లెఫ్టినెంట్ మరియు ఒక మేజర్‌తో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ సెంగే గ్రామం నుండి మిస్సమారీకి వెళుతుండగా దారి మధ్యలో కాంటాక్ట్ కోల్పోయింది. మధ్యాహ్నం 12:30 గంటలకు, దిరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్జాలెప్ గ్రామస్థులు ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను కనుగొన్నారు. ఆ ప్రాంతంలో సిగ్నల్ లేదని, 5 మీటర్ల మేర విజిబిలిటీతో అత్యంత పొగమంచుతో కూడిన వాతావరణం ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news